ఏపీలో రెండు రోజులపాటు భారీ వర్షాలు
- October 21, 2020
ఏపీ:భారీ వర్షాలతో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వర్షాలు, వరదలకు భారీ నష్టం జరిగింది. వరద బాధితులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న భారీ వరదతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. లోతట్టు ప్రాంతాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, ఔటు ఫ్లో 5 లక్షల 25 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలో కృష్ణా నది వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రజలు.. బిక్కుబిక్కుమంటూ పునరావాస కేంద్రాల్లోకి తరలివెళ్లారు. జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, అనపర్తి నియోజకవర్గాల్లో పంటనష్టం భారీగా ఉంది. చేతికి అందివచ్చిన పంట అకాల వర్షాలకు దెబ్బ తినడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్‌లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్‌కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్‌కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









