‘కళాపోషకులు’ టీజర్ విడుదల..
- October 21, 2020
విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరోహీరోయిన్లుగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై చలపతి పువ్వల దర్శకత్వంలో ఏమ్. సుధాకర్ రెడ్డి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ‘కళాపోషకులు’. నటుడు జెమిని సురేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ రోజు హైదారాబాద్ ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈ మూవీ టీజర్ ను మీడియా తరుపున సీనియర్ జర్నలిస్ట్ ప్రభు విడుదలచేసి చిత్ర విజయాన్నిఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో..
దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ - ‘‘ముందుగా నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాత సుధాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సుధాకర్ రెడ్డి గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించడం వల్లే ఔట్పుట్ ఇంతబాగా వచ్చింది. ఆ నలుగురు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విశ్వకార్తికేయ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. మొదటి సినిమా అయినా చాలా బాగా నటించారు. లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది.’ అని అన్నారు.
నిర్మాత ఏమ్. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ - ‘‘మీడియా వారి చేతుల మీదుగా మా సినిమా టీజర్‌ను విడుదలచేయడం హ్యాపీగా ఉంది. ఈ కథకి హీరోగా విశ్వకార్తికేయ పర్ఫెక్ట్ చాయిస్. దర్శకుడు చలపతి పువ్వల ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. కల్యాణ్ సమి కెమెరా వర్క్, ఎలెందర్ మహావీర్ మ్యూజిక్ సినిమాకు అదనవు ఆకర్షణలు కానున్నాయి. ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించే విధంగా ఉండబోతోంది. మీ అందరి సపోర్ట్ కావాలి`’ అన్నారు.
హీరో విశ్వకార్తికేయ మాట్లాడుతూ - ``ఈ మూవీ ఒక టీమ్ వర్క్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ సపోర్ట్‌తోనే మంచి ఔట్పుట్ సాధ్యం అయింది. నిర్మాత ఏమ్. సుధాకర్ రెడ్డి గారు ముందుండి మాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు. చలపతి గారు ఈ కథ నరేట్ చేస్తున్నప్పుడే బాగా నచ్చి ఈ సినిమా చేయడం జరిగింది. మేమందరం ఎంతో ఇష్టంగా కష్టపడి చేసిన `కళాపోషకులు` చిత్రానికి మీ అందరి ఆశిర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
ఈ కార్యక్రమంలో నటులు జెమిని సురేష్, జ్వాలా చక్రవర్తి, చైతన్య, లిరిసిస్ట్ రాంబాబు గోసాల, సంతోష్, మహేష్, రాణి తదితరులు పాల్గొని ప్రసంగించారు.
బ్యానర్: శ్రీ వెన్నెల క్రియేషన్స్
నటీనటులు: విశ్వకార్తికేయ, దీప ఉమాపతి, భాష, చైతన్య, చిన్ను
కెమెరామెన్: కళ్యాణ్ సమి
ఎడిటర్: సెల్వ కుమార్
సంగీతం: ఎలేందర్ మహావీర్
పీఆర్ఓ: సాయి సతీష్
నిర్మాత, స్టొరీ: సుధాకర్ రెడ్డి.ఎమ్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: చలపతి పువ్వల.
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







