బెంగుళూరులో భారీ వర్షాలు
- October 24, 2020
బెంగుళూరు:బెంగుళూరులోని అనేక ప్రాంతాలు భారీ వర్షాలతో తల్లడిల్లుతున్నాయి. బెంగుళూరు రూరల్, అర్బన్, తుమ్ కూరు, చిక్ బల్లాపూర్, హసన్ తదితర జిల్లాల్లో చాలాచోట్ల ఇళ్లన్నీ జలమయమయ్యాయి. నడుములోతుకు పైగా నీళ్లలో తడుస్తూ స్థానికులు తమ పసి బిడ్డలను చేతుల్లో ఎత్తుకుని రక్షించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 15 రోజుల చిన్నారిని ఓ వ్యక్తి ఎత్తుకుని అవతల ఓ మహిళకు అందిస్తుండగా.. తగిన జాగ్రత్తలు చెబుతూ మరో వ్యక్తి ఎదురింటి పైకప్పున నిలబడి కేకలు పెట్టడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. శనివారం కూడా కర్నాటక లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







