సౌదీ ప్రైవేట్‌ సెక్టార్‌లో నేషనలైజేషన్‌ పెరుగుదల

- October 26, 2020 , by Maagulf
సౌదీ ప్రైవేట్‌ సెక్టార్‌లో నేషనలైజేషన్‌ పెరుగుదల

రియాద్‌: సౌదీ అరేబియా ప్రైవేట్‌ సెక్టార్‌, నేషనలైజేషన్‌ ప్రక్రియలో దూసుకెళుతోంది. నేషనల్‌ లేబర్‌ అబ్జర్వేటరీ (ఎన్‌ఎల్‌వో) లెక్కల ప్రకారం, 2019తో పోల్చితే ఈ సీజన్‌లో 21.54 శాతం మేరకు పెరిగింది. 2019లో ఇది 20.4 శాతంగా వుంది. ప్రైవేట్‌ సెక్టార్‌లో పనిచేస్తున్న సౌదీల సంఖ్య 1,758,558కి చేరుకుంది. ఈస్టర్న్‌ ప్రావిన్స్‌ మిగతా రీజియన్లతో పోల్చితే అత్యధిక వృద్ధి చూపించింది. ఇక్కడ 25.16 శాతంగా వుంది నేషనలైజేషన్‌ రేటు. రియాద్‌ రీజియన్‌లో 21.89 శాతం వుంది. మక్కా రీజియన్‌లో 21.47 శాతం కనిపిస్తోంది. మదీనా రీజినయన్‌లో 19.27 శాతం నమోదయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com