ఈ-లెర్నింగ్ ప్లాట్ ఫామ్ ద్వారా రోజుకి 8.5 లక్షల మందికి క్లాసులు

- October 30, 2020 , by Maagulf
ఈ-లెర్నింగ్ ప్లాట్ ఫామ్ ద్వారా రోజుకి 8.5 లక్షల మందికి క్లాసులు

సౌదీ: కోవిడ్ నేపథ్యంలో ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తుండటంతో విద్యార్ధులకు తగిన ఏర్పాట్లు చేస్తోంది సౌదీ విద్యా మంత్రిత్వ శాఖ. ఈ-లెర్నింగ్ విధానంలో స్కూల్ స్టాఫ్, స్టూడెంట్స్ సాంకేతిక సమస్యలు ఎదురవకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటోంది. దీంతో కింగ్డమ్ పరిధిలో ప్రతి రోజు 8,50,000 మంది విద్యార్ధులు  ఈ-లెర్నింగ్ ఫ్లాట్ ఫామ్ 'మద్రసాతి' ద్వారా క్లాసులకు అటెండ్ అవుతున్నారు. వర్చువల్ క్లాసుల ద్వారా పాఠాలు బోధించటంతో హోం వర్క్ ఇవ్వటం, విద్యార్ధులకు అవసరమైన సూచనలు అందిస్తున్నారు టీచర్లు. మద్రసాతితో పాటు ఐన్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా విద్యార్ధులకు క్లాసెస్ నిర్వహిస్తున్నారు. ఇక ప్రతి స్కూల్ లో ఓ లీడర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. క్లాస్ షెడ్యూల్ ను రూపొందించటం..గైర్హాజరైన విద్యార్ధులతో కమ్యూనికేట్ అవటం, వర్చువల్ యాక్సెస్ లో విద్యార్ధులకు సాంకేతిక సమస్యలు తలెత్తితే వాటిని మద్రసాతి ద్వారా స్కూల్ లీడర్లు పరిష్కరిస్తున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com