అమితాబ్ బచ్చన్ పై కేసు నమోదు
- November 03, 2020
కరోనా పై పోరాడి గెలిచిన అమితాబ్ బచ్చన్.. ఇపుడు కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 12కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఒక్క సీజన్ తప్పించి మిగతా అన్ని సీజన్స్‌కు గత ఇరవై ఏళ్లుగా అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. కరోనా నేపథ్యంలో కేబీసీలో కొన్ని కీలక మార్పులు చేసారు. కోవిడ్ -19 నేపథ్యంలో ఈ షోను ప్రేక్షకులు లేకుండానే రన్ చేస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ శుక్రవారం 'కరమ్‌వీర్' పేరిట కేబీసీ స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం చేసింది. ఈ స్పెషల్ ఎపిసోడ్‌లో యాక్టర్ అనూప్ సోనితో పాటు సోషల్ యాక్టివిస్ట్ బెజవాడ విల్సన్ అమితాబ్ ఎదురుగా హాట్ సీటులో కూర్చొని ఈ గేమ్ ఆడారు. ఈ సందర్భంగా ఈ షోలో అడిగిన ఓ ప్రశ్న హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని కేబీసీ హోస్ట్ అమితాబ్ బచ్చన్‌తో పాటు కేబీసీ నిర్వాహకులు, సోనీ టీవీపై యూపీలోని లక్నోలోని ఓ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు అయింది. ఇక రూ. 6,40,000 క్యాష్ ప్రైజ్‌కు సంబంధించిన క్వశ్చన్ ఇపుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడుస్తోంది. అంతేకాదు ఈ సందర్భంగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే క్రమం కొంత మంది మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉందని సోషల్ మీడియా వేదికగా కొంత మంది నెటిజన్లు మండిపడుతున్నారు.
తాజా వార్తలు
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!







