విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- July 10, 2026
విజయవాడ: విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు, విజయవాడ ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ వల్లభనేని బాలశౌరి అధ్యక్షత వహించారు.
సమావేశంలో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు, ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ కో-ఛైర్మన్ కేశినేని శివనాథ్ (చిన్ని), గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు, విజయవాడ విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంతా రెడ్డి, ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సభ్యులు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన, మౌలిక వసతుల విస్తరణ, విమాన సర్వీసుల పెంపు, భద్రతా ప్రమాణాల బలోపేతం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
విమానాశ్రయాన్ని మరింత ఆధునికంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని సమావేశంలో అధికారులు నిర్ణయించారు. అలాగే వివిధ శాఖల మధ్య సమన్వయంతో విమానాశ్రయ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరాన్ని సభ్యులు ప్రస్తావించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







