219 మందితో ఏపీ టీడీపీ రాష్ట్ర కమిటీ ప్రకటన
- November 06, 2020
ఏపీ:219 మందితో ఏపీ టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. మొత్తం 18 మంది ఉపాధ్యాక్షులు, 16 మంది ప్రధాన కార్యదర్శులు, 58 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, 108 మంది రాష్ట్ర కార్యదర్శులతో పాటు... 18 మంది రాష్ట్ర అధికార ప్రతినిధులతో టీడీపీ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర కమిటీలో బడుగు వర్గాలకు పెద్దపీట వేశారు టీడీపీ అధినేత. మొత్తం కమిటీలో బడుగు వర్గాలకు 61 శాతం పదవులు దక్కగా.. బీసీలకు 41 శాతం పార్టీ పదవులు ఇచ్చారు. 50 ఉప కులాలకు ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు. వారసత్వాని కంటే పని తీరుకే ప్రాధాన్యత ఇచ్చారు. అంతే కాదు యువ నాయకత్వానికి కమిటీలో పెద్దపీట వేశారు. అన్ని కులాలు, అన్ని ప్రాంతాల సమతుల్యంతో టీడీపీ రాష్ట్ర కమిటీకి తుది రూపు ఇచ్చారు. ఇప్పటి వరకూ పార్టీలో ఎటువంటి పదవులు లేని ఎంతో మంది కొత్త వారికి.. రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించడం రాజకీయంగా చర్చినీయాంశం అయ్యింది.
రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నిమ్మల కిష్టప్ప, పత్తిపాటి పుల్లారావు, జ్యోతుల నెహ్రూ, గొల్లపల్లి సూర్యారావు, బండారు సత్యానందరావు, పరసా రత్నంతో పాటు... దాట్ల సుబ్బరాజు, సాయికల్పనా రెడ్డి, బూరగడ్డ వేదవ్యాస్, సుజయకృష్ణ రంగారావును నియమించారు. ఇక బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి, బాబూ రాజేంద్రప్రసాద్, తిప్పేస్వామి, హనుమంతరాయ చౌదరి, నర్సింహారెడ్డి, దామచర్ల జనార్థన్‌రావు, శ్రీధర కృష్ణారెడ్డి, వేమూరి ఆనంద సూర్య ఉపాధ్యాక్షులుగా రాష్ట్ర కమిటీలో చోటు దక్కింది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్‌షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్‌లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్‌కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్‌లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









