విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్‌షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- May 04, 2026
విశాఖపట్నం: విజయవాడలో రిజిస్టర్డ్ ఆఫీస్ కలిగిన Arbha Software Solutions సంస్థ విశాఖపట్నంలో తమ కొత్త Offshore Development Center ను ప్రారంభించింది. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టిన వారు ప్రధానంగా విదేశాల్లో ఉన్న NRIలు కావడం విశేషం.
ఈ కార్యక్రమంలో సంస్థ నాయకత్వ బృందంలోని కందిబెడల వరప్రసాద్, గౌరు నాయుడు వోలేటి, సుల్తాన్ అహ్మద్, గులాం దస్తగిరి పాల్గొన్నారు.

ప్రస్తుతం Arbha Software Solutions సంస్థలో సుమారు 100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సంస్థకు హైదరాబాద్ మరియు మంగళూరు (కర్ణాటక) లో కార్యాలయాలు ఉండగా, గల్ఫ్ ప్రాంతాల్లో, ముఖ్యంగా సౌదీ అరేబియా మరియు దుబాయ్ ప్రాంతాల్లో బలమైన ప్రాతినిధ్యం ఉంది. అక్కడి క్లయింట్లకు SAP సేవలను విజయవంతంగా అందిస్తోంది.
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు IT విజన్‌కు అనుగుణంగా విశాఖపట్నాన్ని ఒక ప్రధాన IT హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే Google, Infosys, CTS వంటి ప్రముఖ సంస్థలు విశాఖ పై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో, Arbha Software Solutions కూడా ఈ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వామిగా ఉండడం గర్వకారణమని పేర్కొన్నారు.
Arbha Software Solutions సంస్థకు గ్లోబల్ SAP కన్సల్టింగ్ సేవల్లో విస్తరించాలనే దృఢమైన లక్ష్యం ఉందని, ఈ కొత్త సెంటర్ ద్వారా తదుపరి మూడు సంవత్సరాల్లో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 400కు పైగా ఉద్యోగ అవకాశాలు సృష్టించనున్నట్లు తెలిపారు.
అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమాల ద్వారా మహిళలు మరియు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను సాధికారితం చేయడం కూడా తమ సంస్థ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉందని వివరించారు.
విశాఖలో ప్రారంభించిన ఈ కొత్త కేంద్రం ద్వారా స్థానిక ప్రతిభను ప్రోత్సహిస్తూ, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తమ వంతు సహకారం అందించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







