లంక ప్రీమియర్ లీగ్.. మరో 'సారీ'
- November 07, 2020
కొలంబో:ఈ ఏడాది శ్రీలంక క్రికెట్ బోర్డు లంక ప్రీమియర్ లీగ్ ను పెద్ద ఎత్తున నిర్వహించాలని అనుకుంటూ ఉంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున స్టార్ ప్లేయర్స్ ను టోర్నమెంట్ లో తీసుకోవాలని భావించింది. ప్లేయర్లు కూడా అందుబాటులోకి వస్తామని చెప్పారు. క్రిస్ గేల్, షాహిద్ అఫ్రీది, డూప్లెసిస్ లాంటి స్టార్స్ ఈ టోర్నీలో ఆడడానికి సముఖత వ్యక్తం చేశారు. కానీ నిర్వాహకులు మాత్రం లీగ్ ను మొదలు పెట్టడానికే చాలా సమయం తీసుకునేలా కనిపిస్తూ ఉన్నారు. ఇప్పటికే పలు మార్లు టోర్నమెంట్ వాయిదా పడగా.. మరోసారి కూడా వాయిదా వేస్తున్నామని నిర్వాహకులు స్పష్టం చేశారు.
శ్రీలంకలో కరోనా వైరస్ కేసులు నమోదవుతుండటంతో లంక ప్రీమియర్ లీగ్ ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆగష్టు నెలలో టోర్నమెంట్ నిర్వహించాలని అనుకోగా.. నవంబర్ 14కు వాయిదా పడింది.. ఆ తర్వాత నవంబర్ 21కు వాయిదా పడింది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఆరు రోజులు ఆలస్యంగా నవంబర్ 27న మొదలు కానుంది.
ఈ టోర్నీని మూడు వేదికల్లో జరపాలని భావించినా... కరోనా నేపథ్యంలో టోర్నీలో జరిగే మొత్తం 23 మ్యాచ్‌లను ఒకే వేదికలో నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఎల్సీ పేర్కొంది. హంబన్‌టోట లో టోర్నమెంట్ మొత్తం పూర్తీ చేయనున్నారు. డిసెంబర్ 17న ఫైనల్ జరగనుంది. ఆటగాళ్లకు విధించే క్వారంటైన్‌ను 14 రోజుల నుంచి 7 రోజులకు కుదించేందుకు శ్రీలంక ఆరోగ్య శాఖ అధికారులు అంగీకరించారు. జట్ల సహాయక సిబ్బంది మాత్రం 14 రోజుల క్వారంటైన్‌ను పూర్తి చేయాలి.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







