విక్రమ్‌గా అదరగొట్టిన కమల్ హాసన్
- November 07, 2020
చెన్నై:తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్ను ఆయన పుట్టినరోజు కానుకగా నేడు(నవంబర్ 7న) ఉంటుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ సినిమా అంటే కేవలం తమిళనాటే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వారి ఎదురుచూపులకు అనుకూలంగా తన నెక్ట్స్ మూవీని ప్రకటించాడు కమల్.
తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వలో కమల్ తన 232వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. కాగా ఈ సినిమాకు ‘విక్రమ్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. కాగా ఈ సినిమా టైటిల్ టీజర్‌ను కొన్ని నిమిషాల ముందే చిత్ర యూనిట్ అధికారికంగా రిలీజ్ చేశారు. ఈ టీజర్లో కమల్ హాసన్ సరికొత్త అవతారంలో కనిపించాడు. సైకో కిల్లర్ తరహాలో ఈ టీజర్లో కమల్ కనిపించడంతో ఈ సినిమా కథ ఏమై ఉంటుందా అనే ఆసక్తి అప్పుడే ప్రేక్షకుల్లో మొదలైంది. కాగా మరికొందరు ఈ సినిమాలో కమల్ ఓ భారీ మిషన్‌పై ఉన్నాడని, అందుకే హత్యలు చేస్తుండొచ్చని అంటున్నారు.
ఇక తమిళ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ రవిచందర్ అందించిన బీజీఎం ఈ టీజర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. అదిరిపోయే విధంగా ఈ టీజర్ ఉండటంతో కమల్ హాసన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ చేస్తున్నారు. బర్త్‌డే గిఫ్ట్‌గా లోకనాయకుడు అందించిన ఈ టీజర్‌ను సోషల్ మీడియాలో అభిమానులు తెగ షేర్లు చేస్తున్నారు. మరి ఈ సినిమా కథ ఏమిటో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.
తాజా వార్తలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







