అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్
- November 07, 2020
న్యూయార్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలుపొందారు. పెన్సెల్వేనియాలో తుది ఫలితం ప్రకటించడంతో జో బిడెన్ గెలిచినట్లు అధికారికంగా ప్రకటించారు. పెన్సెల్వేనియాలో మొత్తం 20 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.. అక్కడ జో బైడెన్ ఆధిక్యం కనబర్చడంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితంపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. జో బైడెన్ కు మొత్తం 284 ఎలక్టోరల్ ఓట్లు వచ్చినట్లు తెలుస్తుంది. 538 ఎలక్టోరల్ ఓట్లలో మెజారీటికి కావాల్సిన 270 ఎలక్టోరల్ ఓట్లను బైడెన్ దాటేయడంతో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
కాగా నార్త్ కరోలినా ఫలితం తేలకపోవడంతో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లకే పరిమితమైనట్లు తెలుస్తుంది. దీంతో.. 46వ అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యారు. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ కూడా విజయం సాధించారు. కాగా అమెరికాకు ఎన్నికైన తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!