యూఏఈ జెండాని అవమానిస్తే పాతికేళ్ళ వరకు జైలు
- November 10, 2020
అబుధాబి: యూఏఈ జాతీయ జెండాని అవమానించినా, దుర్వినియోగం చేసినా కరిÄనమైన శిక్షలు తప్పవని హెచ్చరించింది పబ్లిక్ ప్రాసిక్యూషన్. ఈ నేరానికి 10 నుంచి 25 ఏళ్ళ వరకు జైలు శిక్ష అలాగే 500,000 దిర్హాముల వరకు జరీమానా విధించే అవకాశం వుంటుంది. అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాల్ని స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. జెండా అనేది జాతీయ ఐక్యతకు గుర్తు అని ఆ ట్వీట్స్‌లో పేర్కొన్నారు. చట్టాల పట్ల అవగాహన పెంచే క్రమంలో ఈ ప్రమోషన్ క్యాంపెయిన్‌ని సోషల్ మీడియా వేదికగా చేపట్టారు. ఆర్టికల్ 3, ఫెడరల్ చట్టం నెంబర్ 2 ఆఫ్ 1971, సంబంధిత అమెండ్‌మెంట్స్ ప్రకారం ఉద్దేశ్యపూర్వకంగా జాతీయ జెండాని అవమానిస్తే వారిపై పైన పేర్కొన్న విధంగా చర్యలు తీసుకోబడతాయి.
తాజా వార్తలు
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు







