బైడెన్ విజయం పై టెడ్రోస్ ఆసక్తికర వ్యాఖ్యలు
- November 10, 2020
జెనీవా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జో బైడెన్ విజయం కరోనా మహమ్మారి అంతానికి ప్రపంచ సహకారాన్ని సూచిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ వైరస్ ను తుదముట్టించేందుకు జో బైడెన్, కమలా హారిస్ లతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.
ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రపంచదేశాలతో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని మహమ్మారి తెలియచెప్పిందని, తప్పుదారి పట్టించే జాతీయవాదం కారణంగా ఇటీవల కాలంలో ఈ దృక్పథం క్షీణించిందని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగుతున్నట్టు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తూ అధనోమ్ ఈ విధంగా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కాగా, డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగాలన్న ట్రంప్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని జో బైడెన్ ఇటీవల సంకేతాలు ఇచ్చారు. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఇటీవల ఆయనను కలిసిన ఓ వ్యక్తికి కరోనా అని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







