`ఐశ్వర్యా ఛాలెంజ్` ట్రైలర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్
- November 11, 2020
హైదరాబాద్:వరల్డ్ ఫేమస్ లవర్, కౌసల్య కృష్ణ మూర్తి వంటి చిత్రాలతో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ' మరియు రాజమౌళి గారి RRR లో జాయిన్ అవుతున్న ఐశ్వర్య రాజేష్ నటించి పూర్తిగా మలేసియాలో రూపొందించిన ఈ చిత్రాన0 `ఐశ్వర్యా ఛాలెంజ్` పేరుతో త్వరలో విడుదలచేస్తున్నారు. అభినయ్..సుమన్ శెట్టి తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఇటీవల విడుదల చేసిన `ఐశ్వర్యా ఛాలెంజ్`ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా దీపావళి కానుకగా రామ్‌గోపాల్ వర్మ బ్లెసింగ్స్‌తో ట్రైలర్‌ని డిజిటల్ మాధ్యమంలో విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలో విడుదలకి సిద్దంగా ఉంది. ఈ సందర్భంగా..
నిర్మాణ, నిర్వహణ వెల్లూరు మధుబాబు మాట్లాడుతూ.. నన్ను నమ్మి రెండో సినిమాకు నిర్మాణ నిర్వహణ గా అవకాశం ఇచ్చిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయనతో నా అనుభంధం ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. పాత్రికేయుడుగా చిరపరిచయం ఉన్న ధీరజ్ అప్పాజీ గారు ఈ చిత్రానికి మాటలు వ్రాసారు. సౌండ్ ఇంజినీర్ నాగేశ్వరరావు గారు అద్భుతమైన నిర్మాణ అనంతర కార్యక్రమాలు నిర్వహించారు. రచ్చ రవి..జబర్దస్త్ రవి తన వాయిస్ ని ఇచ్చారు.పాటలు.రాజు .హర్ష.మోహనరావు, ఐశ్వర్యా తదితరులు పాడారు. సినిమా చూశాను చాలా బాగా వచ్చింది, ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా త్వరలో థియేటర్స్ లో విడుదల కానుంది``ఆహా ఊర్వశి ATT ల ద్వారా కూడా విడుదలకు సన్నాహాలు చేస్తున్న అన్నారు.
పాటల రచనః లక్ష్మీపెండ్యాల, సమర్పణః డా. పద్మ శ్రీ. కూటికుప్పల సూర్యారావు, నిర్మాతః తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, దర్శకత్వంః సూర్య నిధి.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







