స్లిమ్ లుక్ లో మాయ చేస్తున్న నటాశా దోషి..
- November 11, 2020
హైదరాబాద్:మొన్నటి వరకు బొద్దుగా ముద్దుగా కనిపించిన నటాషా దోషి ఇప్పుడు ఒక్కసారిగా స్లిమ్ అయిపోయింది. మెరుపుతీగకు చెల్లిలా మారిపోయింది. నందమూరి బాలకృష్ణ సరసన జై సింహా సినిమాలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. అమ్మకుట్టి అమ్మకుట్టి అంటూ అదిరిపోయే స్టెప్పులు వేసింది. అందులో బాలయ్యకు పోటీగా నటాషా వేసిన డాన్స్ లకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. జై సింహాలో కాస్త బొద్దుగా కనిపించిన ఈ బొద్దుగుమ్మ.. ఇప్పుడు పూర్తిగా బరువు తగ్గిపోయి స్లిమ్ అయిపోయింది. తాజాగా విడుదలైన ఈమె ఫోటోషూట్ చూసి అందరూ ఫిదా అయిపోతున్నారు. రెడ్ అండ్ గోల్డ్ కలర్ డ్రెస్సులో అమ్మడి చూపులకు అందరూ బాపురే క్యా షేపురే అంటున్నారు. మరోవైపు బ్లాక్ అండ్ టైట్ జీన్స్ లోనూ సన్నగా మెరుపు తీగలా అదిరిపోయే గ్లామర్ షో చేస్తూ కొంటె చూపులతో ఊపిరి తీస్తుంది నటాషా దోషి. జై సింహా తర్వాత మరికొన్ని అవకాశాలు కూడా అందుకుంది ఈ భామ. తాజాగా తన మేకోవర్ తో దర్శక నిర్మాతలతో పాటు ప్రేక్షకుల మతి పోగొడుతుంది. నటాషాను ఇలా చూసిన తర్వాత అవకాశాలు ఇవ్వకుండా మాత్రం ఎందుకు ఉంటారు. ఇప్పటికే ఈ భామకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. కచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. కెరీర్ లో ఒక మంచి బ్రేక్ వస్తే చాలు ఖచ్చితంగా నటాషా చక్రం తిప్పడం లాంఛనమే. మరి ఆ బ్రేక్ ఇచ్చే ఆఫర్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!