బహ్రెయిన్ ప్రధానమంత్రిగా ప్రిన్స్ సల్మాన్ నియామకం

- November 12, 2020 , by Maagulf
బహ్రెయిన్ ప్రధానమంత్రిగా ప్రిన్స్ సల్మాన్ నియామకం

మనామా:బహ్రెయిన్ ప్రధానమంత్రిగా ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాను నియమించారు. ఈ మేరకు బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా రాయల్ ఆర్డర్ 44/2020ని జారీ చేశారు. ప్రిన్స్ సల్మాన్ ప్రస్తుతం డిప్యూటీ కమాండర్ గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే..అధికారిక గెజిట్ వెలువడిన మరుక్షణం నుంచి రాయల్ ఆర్డర్ 44/2020 అమలులోకి రానుంది. ప్రిన్స్ సల్మాన్ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. 

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com