హైదరాబాద్ చేరుకున్న కరోనా వ్యాక్సిన్

- November 12, 2020 , by Maagulf
హైదరాబాద్ చేరుకున్న కరోనా వ్యాక్సిన్

హైదరాబాద్:కరోనా కట్టడికి రష్యాలో అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్లు భారత్‌కు చేరుకున్నాయి.హైదరాబాద్ చేరిన ఈ వ్యాక్సిన్ వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఈ వ్యాక్సిన్‌పై 2-3 దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌కు అనుమతులు దక్కాయి. త్వరలోనే ఈ ట్రయల్స్‌ ప్రారంభించనున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది. స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ కరోనా నిరోధానికి 92 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని గమలేయా, రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ తెలిపాయి. దాదాపు 40వేల మంది వాలంటీర్లపై రష్యాలో నిర్వహించిన అతిపెద్ద మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించిన.. తొలి మధ్యంతర డేటా ఆధారంగా ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు ఆ సంస్థలు వివరించాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com