దుబాయ్, షార్జాలో పోస్ట్ కోవిడ్ రికవరి ఆస్పత్రులను ప్రారంభించిన యూఏఈ
- November 13, 2020
కోవిడ్ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్యతో పాటు..వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుంది. ఇది ఆశాజనకమైన అంశమే అయినా..వైరస్ నుంచి బయటపడిన వారిలో ఇంకా దాని తాలుకు దుష్ప్రభావం రోగులను వెంటాడుతుండటం మరో సమస్యగా మారుతోంది. నిజానికి కోవిడ్ నుంచి కోలుకొని నెగటివ్ రిపోర్ట్ వచ్చినా..అంతకుముందున్నట్లుగా సంపూర్ణ ఆరోగ్యంగా మాత్రం ఉండటం లేదు. దీర్ఘకాలంలో శ్వాసకోస సంబంధిత ఇబ్బందులతో పాటు మతిమరుపు, ఆందోళన, మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీంతో కోవిడ్ అనంతరం దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారి కోసం యూఏఈ ప్రభుత్వం ప్రత్యేకంగా పోస్ట్ కోవిడ్ రికవరి ఆస్పత్రులను ప్రారంభించింది. దుబాయ్, షార్జాలతో ప్రారంభమైన ఈ ఆస్పత్రులలో కోవిడ్ నుంచి కోలుకొని..దాని తాలుకు దుష్ప్రభావాన్ని ఎదుర్కుంటున్న వారికి అవసరమైన చికిత్స అందిస్తారు. కోవిడ్ నుంచి కోలుకున్న అనంతరం కూడా శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కునే రోగులను ముందుగా పరిశీలించి వారికి ఏ తరహా చికిత్స అవసరమో..ఆ స్పెషలిస్ట్ కు రిఫర్ చేస్తారు. దీంతో బాధితులు పూర్తిగా కోలుకునేందుకు ఆస్కారం ఏర్పడుంది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







