యూఏఈ : సీవేజ్ పిట్ లో పడి ఆరేళ్ల బాలుడు మృతి
- November 13, 2020
యూఏఈ: తల్లిదండ్రుల నిర్లక్ష్యం తమ ఒకగానొక కుమారుడ్ని బలి తీసుకుంది. రస్ అల్ ఖైమా పరిధిలో ఈ విషాదం చోటు చేసుకుంది. రషిద్ అహ్మద్ అనే అరేళ్ల బాలుడు..తమ ఇంటి ప్రాంగణంలో ఆడుకుంటూ మురుగు నీటి ట్యాంక్ లో పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత కొడుకు కోసం అతని తల్లి ఇంట్లో వెతకటం ప్రారంభించింది. ఎంతకీ కనిపించకపోయే సరికి ఆందోళన చెందిన ఆమె భర్త, సోదరుడు కూడా బాబు కోసం ఇల్లంతా గాలించారు. మ్యాన్ హోల్ తెరిచి ఉంచంటంతో మురుగు నీటిలో పడిపోయాడేమోననే అనుమానంతో ట్యాంక్ లో కూడా చూశారు. అప్పటికే మృతి చెందిన బాబు మృతదేహం అడుక్కువెళ్లిపోవటంతో కుటుంబసభ్యులు గమనించలేకపోయారు. బాబు ఆచూకీ లేకపోవటంతో మరింత ఆందోళన చెందిన కుటుంబసభ్యులు రస్ ఆల్ ఖైమా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు...ఘటన స్థలానికి సివిల్ డిఫెన్స్ బృందాలను ఘటనా స్థలానికి పంపించారు. ఇల్లంతా వెతికిన బృందాలు..చివరికి పెద్ద కర్రతో మురుగు నీటి గుంటలో వెతికారు. కర్రకు బాబు మృతదేహాం తగలటంతో ట్యాంక్ నుంచి బయటికి తీశారు. అప్పటివరకు చలాకీగా ఆడుకున్న కొడుకుని...విగతజీవిగా చూసేసరికి ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమారుడు తమ నిర్లక్ష్యంతో బలితీసుకున్నామని తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆ తల్లిదండ్రుల ఆవేదన చుట్టుపక్కల వాళ్లను కూడా చలించేలా చేసింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు