' జికా ' వైరస్ పట్ల యు.ఎ.ఇ. సదా అప్రమత్తత
- February 16, 2016
' జికా ' వైరస్ పట్ల యు.ఎ.ఇ. సదా అప్రమత్తతగా ఉంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం పట్ల సహకరిస్తున్న ప్రజలకు సంబంధిత శాఖ ఉన్నాతాధికారి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించినట్లుగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నట్లు యు.ఎ.ఇ. ఆరోగ్య మంత్రిత్వ శాఖ చికిత్సాలయ సహాయ కార్యదర్శి మంగళవారం అరబిక్ బాష దినపత్రిక ' అల్ బాయన్ ' కు తెలిపారు. యు.ఎ.ఇ.లో ఇప్పటి వరకు ఎటువంటి ' జికా ' వైరస్ కేసులు నమోదు కాలేదని, నిరంతరం ప్రయాణికులవిమానాలను ఇతర దేశాల నుంచి యు.ఎ.ఇ.కు వచ్చినపుదు అందులోని స్మూక్ష క్రీములను నశింపచేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ' జికా ' వైరస్ వ్యాపించివున్నదేశాలకు వెళ్ళేవారు తగిన ప్రమాణాలు పాటించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అదే విధంగా, దోమలు విస్తరించి ఉన్న ప్రదేశాలకు వెళ్ళేవారు, దోమలు ఆకర్షించలేని తెలుపు మరియు లేతరంగు వస్త్రాలను ధరించడం మంచిదని చికిత్సాలయ సహాయ కార్యదర్శి వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







