డాక్యుమెంట్లు లేని వలసదారులకు ఎంబసీ వద్ద ఔట్‌పాస్‌లు
- November 16, 2020
మస్కట్: దేశం విడిచి వెళ్ళాలనుకునే వలసదారుల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆదివారం మొదలైంది. ఎలాంటి రుసుములు చెల్లించకుండానే దేశం విడిచి వెళ్ళేందుకు కల్పించిన ఈ అవకాశం డిసెంబర్ 31 వరకు అందుబాటులో వుంటుంది. మినిస్ట్రీ & టాఫ్ లేబర్ వెబ్సైట్ (mol.gov.om)లో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. వర్క్ వీసా గడువు తీరిన వలస కార్మికులు, స్వదేశానికి వెళ్ళేందుకు వీలుగా ఈ వెసులుబాటు కల్పించారు. మినిస్ట్రీకి చెందిన వెబ్‌సైట్‌తోపాటు సనద్ కేంద్రాల్లోనూ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. రిజిస్ట్రేషన్ జరిగిన ఏడు రోజుల తర్వాత, విమాన ప్రయాణానికి ఏడు గంటల ముందు వలస కార్మికుడు మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కార్యాలయాన్ని సందర్శించాల్సి వుంటుంది. చెల్లుబాటయ్యే టిక్కెట్టు అలాగే ట్రావెల్ డాక్యుమెంట్లు, 72 గంటల ముందుగా చేయించుకున్న పీసీఆర్ టెస్ట్ వివరాలు తమ వెంట తీసుకెళ్ళాలి. వలసదారులు, సరైన డాక్యుమెంటేషన్ లేనిపక్షంలో, వారు ఎంబసీలను సంప్రదించాలి. పాస్‌పోర్ట్ లేనివారు కూడా, ఎంబసీ జారీ చేసే ఔట్పాస్తో స్వదేశానికి వెళ్ళవచ్చు. బంగ్లాదేశీ వలసదారులు బర్త్ రిజిస్ట్రేషన్ కార్డు, పాస్‌పోర్ట్ కాపీ లేదా నేషనల్ ఐడీ కార్డుని సమర్పించాలి. సామాజిక కార్యకర్తలు ఆయా ఎంబసీలతో కలిసి వలసదారులకు సహాయ సహకారాలు అందిస్తారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!