శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- February 26, 2026
టీ20 ప్రపంచకప్ 2026లో శ్రీలంక ప్రస్థానం ముగిసింది. సూపర్-8 పోరులో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో శ్రీలంక 61 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ వరుసగా రెండో ఓటమితో లంక సెమీస్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.
న్యూజిలాండ్ నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక కివీస్ బౌలర్ల ధాటికి తలవంచింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. లంక బ్యాటర్లలో కమిందు మెండిస్ (31), వెల్లలాగే (29) మినహా మిగతా వారెవరూ కనీసం పోరాట పటిమ కనబరచలేదు. కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర 4 వికెట్లతో లంక పతనాన్ని శాసించగా, మ్యాట్ హెన్రీ 2, శాంట్నర్, ఫిలిప్స్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో సఫలమైంది. పక్కా ప్రణాళికతో బౌలింగ్, ఫీల్డింగ్‌లో రాణించిన కివీస్, లంకను తక్కువ స్కోరుకే కట్టడి చేసి సెమీస్ దిశగా అడుగులు వేసింది.
తాజా వార్తలు
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..
- సౌదీ అరేబియాలోని జాజాన్‌లో యెమెన్ వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో ప్రైవేట్ రంగ ఉద్యోగుల జీతాలకు కొత్త వ్యవస్థ..!!







