ఉగ్రవాదుల అరెస్ట్కకు తెలంగాణ-ఒడిశా జాయింట్ ఆపరేషన్..
- February 17, 2016
తెలంగాణ-ఒడిశా పోలీసుల జాయింట్ ఆపరేషన్ తో సిమీ(స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా) ఉగ్రవాదుల ఆటకట్టించారు. ఒడిశాలోని రూర్కెలాలో నలుగురి ఉగ్రవాదులను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిమీకు చెందిన అమ్జాద్, జకీర్, మోహబూబ్, సాలిఖ్ లుగా గుర్తించారు. మధ్యప్రదేశ్ ఖాండ్వా జైలు నుంచి 2013 అక్టోబర్ లో ఏడుగురు ఉగ్రవాదులు పరారయ్యారు. ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో వీరు తలదాచుకున్నారు. తెలంగాణ-ఒడిశా పోలీసులకు అందిన పక్కా సమాచారంతో ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ ఎన్ కౌంటర్ లో మరణించిన ఉగ్రవాదులు ఎజాజుద్దీన్, అస్లాంలతో వీరికి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది.తాజా ఘటనతో స్థానికులు తీవ్ర భయందోళనను వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన అనంతరం రహస్య ప్రాంతంలో విచారించేందుకు తరలించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







