'అరకు రోడ్‌లో..'. ఈ చిత్రం టీజర్ విడుదల..
- February 17, 2016
రామ్ శంకర్, నికేష పటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రమణ్యం, సురేష్ వర్మ ఇందుకూరి, నక్కా రామేశ్వరి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'అరకు రోడ్‌లో..'. ఈ చిత్రం టీజర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో ఆకాష్‌పూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆకాష్‌పూరి మాట్లాడుతూ, 'సినిమా టీజర్, పోస్టర్స్ కొత్తగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్' అని అన్నారు. 'దర్శకుడు వాసుదేవ్ నాకు మంచి స్నేహితుడు. మంచి సినిమా తీసే సత్తా గల దర్శకుడితో పని చేయడం ఆనందంగా ఉంది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ని ప్రారంభించాం. మరో 20 రోజుల్లో చిత్రీకరణ పూర్తవుతుంది' అని హీరో రామ్‌శంకర్ చెప్పారు.'నన్ను నమ్మి సపోర్ట్ చేస్తున్న నిర్మాతలకు కృతజ్ఞతలు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి మే నెలలో విడుదల చేసేందుకు సన్నా హాలు చేస్తున్నాం' అని దర్శకుడు అన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







