రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకేసారి రంగంలోకి
- February 17, 2016
మెగాహీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకేసారి రంగంలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 18న మెగా అభిమానులకు డబుల్ బొనాంజా అందించేందుకు రెడీ అవుతున్నారు. బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న 'సరైనోడు' గురువారం టీజర్‌తో సిద్ధమౌతుండగా...అదే రోజు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ 'తనీ ఒరువన్' రీమేక్‌ను మొదలు పెట్టనున్నాడు. ఆ చిత్రానికిగానూ 'రక్షక్' టైటిల్లో పరిశీలనలో ఉండగా....రీసెంట్గా 'ధృవ' అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 18న సెట్స్‌పైకి వెళ్తోంది. ఇలా బన్నీ, చరణ్‌లు ఒకేసారి రంగంలోకి దిగుతున్నారు. అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహారిస్తున్న ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులు ఒకే రోజున రావడంతో మెగా ఫ్యామిలీ అభిమానుల్లో సందడి నెలకొంది. ఈ రెండు చిత్రాలు గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే చిత్రీకరించడం విశేషం. ఇదిలా ఉంటే గీతా ఆర్ట్స్ సంస్థ ఈ ఏడాది చిత్రనిర్మాణంలో మరింత జోరు పెంచింది. ప్రస్తుతం ఈ బ్యానర్లో మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి. తన ఇద్దరు కొడుకుల సినిమాలతో పాటు మేనల్లుడి సినిమాను కూడా నిర్మిస్తున్నాడు అల్లు అరవింద్. బన్నీ హీరోగా "సరైనోడు" సినిమా నిర్మిస్తున్న అరవింద్.. మరోవైపు అల్లు శిరీష్ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో "శ్రీరస్తు శుభమస్తు" సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇక చరణ్ "తనీ ఒరువన్" రీమేక్ ను ఎన్.వి.ప్రసాద్ తో కలసి నిర్మించబోతున్నాడు. సో.. ముగ్గురు మెగా ఫ్యామిలీ హీరోలతో ఈ ఏడాది మూడు సినిమాలు నిర్మిస్తున్నాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







