శిల్పాశెట్టి తెలంగాణా లో కంపెనీ పెట్టబోతుంది...
- February 17, 2016
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక అనేక సంస్థలు తమ పెట్టుబడి ని పెట్టడానికి ముందుకు వస్తున్నాయి..ఇప్పటికే చాల కంపెనీ లు తెలంగాణా ముఖ్య మంత్రి కెసిఆర్ తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.. ఇక మొబైల్ రంగం వారు కూడా తమ కంపెనీ పరిశ్రమలను తెలంగాణా లో ఏర్పాటు చేయడానికి వచ్చారు. వారిలో మైక్రోమ్యాక్స్, సెల్ కాన్ తదితర కంపెనీలు మొబైల్ ఫోన్ల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.తాజాగా మరో మొబైల్ పరిశ్రమ కన్ను తెలంగాణా ఫై పడింది.అది కూడా ఓ ప్రముఖ బాలీవుడ్ నటికి చెందినది కావడం విశేషం. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రాతో కలిసి గత ఏడాది హిందుస్థాన్ సేప్టీ గ్లాస్ ఇండస్ట్రీస్ (హెచ్ఎస్జీఐ) ద్వారా వారి కుమారుడు 'వివాన్' పేరిట సెల్ ఫోన్ల తయారీకి శ్రీకారం చుట్టారు.ఈ నేపద్యం లో శిల్పాశెట్టి భాగస్వామిగా ఉన్న హెచ్ఎస్జీఐ ఇప్పుడు తెలంగాణాలో సెల్ ఫోన్ తయారీ పరిశ్రమ నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







