పాయల్ రాజ్ పుత్ అనగనగా ఓ అతిధి చిత్ర ప్రెస్ మీట్..
- November 20, 2020
హైదరాబాద్:ట్రెండ్ లౌడ్ డిజిటిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై టాలెంటెడ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన చిత్రం అనగనగా ఓ అతిధి. ఆహా యాప్ లో నవంబర్ 20న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో పాయల్ తో పాటు యువ కథనాయకుడు చైతన్య కృష్ణ, నటులు ఆనంద్ చక్రపాణి, వీణ సుందర్ తదితరలు కీలక పాత్రల్లో నటించారు. దయాల్ పద్మనాభన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని రాజా రామ్ మూర్తి, చిదంబరం నటీసన్ నిర్మించారు. అనుకోని పరిస్థితుల్లో ఓ అర్ధరాత్రి ఓ ఇంటికి వచ్చిన అతిధి కారణంగా ఎదురైయ్యే సమస్యలు కథాంశంగా ఈ సినిమాను దర్శకుడు దయాల్ అత్యంత ఉత్కంఠ కలిగేలా రూపొందిచారు. ఈ చిత్ర ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది.
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ.. అనగనగా ఓ అతిధి చిత్రం నా కెరీర్లో ప్రత్యేకంగా మిగిలిపోతుంది. ఇప్పటి వరకు నేను నటించిన సినిమాలలో ఇది చాలా భిన్నంగా ఉంటుంది. ఓ పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించాను. విచారణ చేయడానికి చాలా హోం వర్క్ చేయాల్సి వచ్చింది. దర్శకుడు ఈ కథ చెప్పగానే నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. ప్రేక్షకులకు కూడా ఈ సినిమా అద్భుతంగా నచ్చుతుందని నమ్మకంగా ఉన్నాను.. అని తెలిపారు.
నటీనటులు:
పాయల్ రాజ్ పుత్, చైతన్య కృష్ణ, ఆనంద్ చక్రపాణి, వీణ సుందర్
టెక్నికల్ టీం:
దర్శకుడు: దాయల్ పద్మనాభన్
ప్రొడక్షన్ హౌస్: ట్రెండ్ లౌడ్ డిజిటిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
సినిమాటోగ్రాఫర్: రాకేష్ బి
ప్రొడ్యూసర్స్: రాజా రామామూర్తి, చిందబర్ నటీశన్
మ్యూజిక్ డైరెక్టర్: ఆరోల్ కోరెల్లి
రైటర్: కాశీ నదీంపల్లి
తాజా వార్తలు
- మచిలీపట్నం బస్‌స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్‌దేవ్ యోగాభ్యాసం
- ముంబై ఐఐటీ క్యాంపస్‌లో చిరుతపులి కలకలం
- బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనపై UBIDEF ఆందోళన
- యూఏఈలో ఎండలు మండుతున్నాయి..49.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- కువైట్‌లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!
- అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- మెరైన్ సర్వే సేఫ్టీ డ్రైవ్ ను ప్రారంభించిన కోస్ట్ గార్డ్..!!
- ఖతార్ బహుమతిగా ఇచ్చిన 'ఎయిర్ ఫోర్స్ వన్' టెస్టింగ్ పూర్తి..!!
- అల్ బురైమీలో RO6 మిలియన్ల విలువైన ప్రాజెక్టులు..!!







