చివరి దశకు చేరుకున్న కింగ్ హమెద్ రహదారి పనులు
- November 21, 2020
బహ్రెయిన్: 9.3 మిలియన్ల దినార్లతో చేపట్టిన కింగ్ హమెద్ రహదారి పనులు ఇక చివరి దశకు చేరుకున్నట్లు పట్టణ ప్రణాళిక, మున్సిపల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రహదారి పనులు శరవేగంగా జరుగున్నట్లు వివరించారు. రహదారి అభివృద్ధి పనుల్లో భాగంగా ఇప్పటికే రెయిన్ వాటర్ డ్రైనేజ్, రహదారి పక్కన ఓపెన్ కెనాల్, పేవింగ్ రోడ్స్, లైటింగ్ పోల్స్, ట్రాఫిల్ లైట్స్, రహదారికి ఇరువైపుల సెఫ్టీ బ్యారియర్ల నిర్మాణం పనులు చేపట్టినట్లు వివరించింది. ఇక ఇప్పుడు రోడ్డుపై తారు పనులు, పేవింగ్ వర్క్స్ పూర్తి కావాల్సి ఉందని వెల్లడించింది. మొత్తం మూడు లేన్లుగా రహదారిని విస్తరిణ పనులు జరుగుతున్నాయని, 96వ స్ట్రీట్ దగ్గర కూడలిని అభివృద్ది చేస్తున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. రహదారి పనులను మరింత శరవేగంగా పూర్తి చేసేందుకు ట్రాఫిక్ తక్కువగా ఉండే వీకెండ్స్ లో పనులు జరిగే చోట ఆంక్షలను అమలు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల..!!
- దుబాయ్ లో క్రికెట్ ఆడుతూ కర్ణాటక వాసి మృతి..ఘనంగా నివాళులు..!!
- షార్జా బ్యాంక్ మిలియనీర్ క్యాంపెయిన్..Dh2 మిలియన్లు గెలిచిన భారత ప్రవాసి..!!
- మక్కాలో పవిత్ర కాబాను కొత్త 'కిస్వా'తో అలంకరణ..!!
- ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన ఒమన్..!!
- T4 టెర్మినల్ నుంచి ఒకే ఫారీన్ ఫ్లైట్ కు అనుమతి..!!
- తల్లి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష..!!
- 22 మంది చిన్నారుల మృతి.. ‘దగ్గు సిరప్’ల పై కేంద్రం కీలక నిర్ణయం..
- ఇండోనేసియాలో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు
- ఈనెల 19 నుంచి హార్ముజ్ పూర్తిగా ఓపెన్–ట్రంప్









