కారులో బాంబు పేలుడు : 28 మంది మృతి
- February 17, 2016
టర్కీ రాజధాని అంకారాలో దారుణం చోటు చేసుకుంది. టర్కీ మిలటరీ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 28 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 61 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు టర్కీ ఉప ప్రధాని గురువారం వెల్లడించారు. క్షతగాత్రులు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉప ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడికి కారణం ఎవరు అనేది ఇంకా తెలియలేదని చెప్పారు. అయితే బాంబులు నింపిన వాహనాల వల్లే ఈ దారుణం చోటు చేసుకుందని అంకారా గవర్నర్ తెలిపారు. మిలటరీ సిబ్బంది నివసించే ప్రాంతంలో ఈ కారు బాంబు పేలుడు చోటు చేసుకుందన్నారు.టర్కీ పార్లమెంట్ కు కూతవేటు దూరంలో ఈ పేలుడు సంభవించిందని మీడియా పేర్కొంది. కాగా ఇది తీవ్రవాదుల చర్య అని పార్లమెంట్ అధికార ప్రతినిధి అభివర్ణించారు. ఈ దారుణం చోటు చేసుకున్న సమయంలో టర్కీ దేశాధ్యక్షుడు అధ్యక్షతన ఉన్నతస్థాయి భద్రత సమావేశం జరుగుతుందని తెలిపారు. అయితే ఈ పేలుడును టర్కీ ప్రభుత్వం ఖండించింది. ఈ పేలుడు బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. టర్కీలో వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







