హైదరాబాద్-మేడారం వరకు హెలికాప్టర్ సేవలు..
- February 17, 2016
మేడారం జాతర సందర్శనకు భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం హెలికాప్టర్ సేవలకు అనుమతి ఇచ్చింది. ఈ సేవలు నేడు, రేపు అందుబాటులో ఉండనున్నాయి. హైదరాబాద్-మేడారం, వరంగల్-మేడారం వరకు హెలికాప్టర్ సేవలు. వరంగల్ నుంచి మేడారం ఒకరు వెళ్లి రావడానికి ఖర్చు రూ. 26,500. అదే హైదరాబాద్ నుంచి మేడారంకు నలుగురికి ప్యాకేజీ ధర రూ. 2,75,000గా ఉంది. అదేవిధంగా సమ్మక-సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జాతర సందర్భంగా ఆర్టీసీ 4 వేల బస్సులు నడుపుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 51 ప్రాంతాల ద్వారా 11 వేల మంది సిబ్బంది సేవలు అందిస్తున్నారు. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సహా పలు రాష్ర్టాల నుంచి నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివస్తున్నారు. కోటిన్నర మంది భక్తులు వస్తారన్న అంచనాతో అధికారుల ఏర్పాట్లు చేశారు. దాదాపు వెయ్యి ఎకరాల్లో 27 చోట్ల ప్రైవేటు వాహనాల పార్కింగ్‌కు ఏర్పాటు. భక్తులకు వన ప్రసాదంగా ప్రభుత్వం 10 లక్షల మొక్కలు పంపిణీ చేస్తుంది. 7 కేంద్రాల ద్వారా రూ. 5 చొప్పున భక్తులకు మొక్కల పంపిణీ. భక్తులు మేడారం చుట్టూ 8 కిలోమీటర్ల పరిధిలో తాత్కాలిక ఆవాసాలు వేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







