ప్రధాని చొరవతో బహ్రెయిన్ విమానాశ్రాయ విస్తరణ కార్యక్రమం

- February 17, 2016 , by Maagulf
ప్రధాని చొరవతో బహ్రెయిన్ విమానాశ్రాయ విస్తరణ కార్యక్రమం

బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రాయ విస్తరణ కార్యక్రమం గురువారం ప్రారంభించనున్నారు. రవాణా మరియు టెలి కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖ నిర్వహణలో బహ్రెయిన్ ప్రధాని, గౌరవనీయ యువరాజు ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా పోషణలో విమానాశ్రాయ విస్తరణ పనులు జరగనున్నాయి. గత 20 ఏళ్ళకాలంలో బహరిన్ రాజ్యంలో ఇదే  అతి పెద్ద విమానయాన అవస్తాపక ప్రణాళిక. ప్రస్తుతం బహరిన్ విమానాశ్రాయ విస్తరణ కార్యక్రమం పూర్తికాబడితే, ఇక్కడనుంచి ఏడాదికి 14 లక్షల మంది  విమాన ప్రయాణికులను అనుమతివ్వనుంది. ఇది బహరిన్ రాజ్యంలో ఎంతో వ్యూహాత్మక స్థానం. అలాగే, విమానయాన రంగంలో ప్రాంతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో సంఘటితం అయ్యేందుకు సహాయం చేస్తుంది. ఈ విస్తరణ చర్యల్లో 201,467 చదరపు మీటర్ల ప్రయాణికుల గమ్యస్థానాల అంచు, నిష్క్రమణ మందిరం , తనిఖీ చేసే విభాగాలు , పాస్ పోర్ట్  నియంత్రణా కేంద్రాలు మరియు 28 భద్రతాదారులు, డ్యూటీ ఫ్రీ , రవాణా సరుకులను అందించే నిష్క్రమణ ద్వారాలు, విమానంలో వచ్చినవారికి పాస్ పోర్ట్ నియంత్రణ కేంద్రాలు, ఈ - ద్వారాలు , బెల్ట్ ద్వారా నడపబడే బ్యాగులను ప్రయాణికులు చేజిక్కించుకొనే ప్రాంతాలు మరియు కార్లను పార్కింగ్ చేసుకొనే ప్రదేశాలు ఉన్నాయి. ఇక బెహరినీయులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ రవాణా దుకాణాలు ప్రయాణికుల టెర్మినల్లో ఏర్పాటు కానున్నాయి.   

              
                    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com