షార్జా లో మహిళలకు ఓ ప్రత్యేక బీచ్
- February 17, 2016
షార్జా లోని దిబ్బ అల్ హిష్ ప్రాంతంలో మహిళలకు మాత్రమె ప్రత్యేకంగా ఒక బీచ్ ఉండే విధంగా రూపొందించ నున్నారని అరబ్ ఎమరేట్స్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది.సుప్రేం కౌన్సిల్ సభ్యులు , షార్జా పాలకుడు డాక్టర్ షేఖ్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ కసిమి మంగళవారం దిబ్బ అల్ హిష్ లోని పలు ప్రాజెక్ట్ ల తనిఖీ , కీలక సేవల పర్యవెక్షణ జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళల కోసం ఒక ప్రత్యేక బీచ్ ఉండే విధంగా నిర్మాణం జరగాలని కోరారు. అదేవిధంగా ఒక వారసత్వ గ్రామాన్ని ఏర్పాటు చేసి, షార్జా హెరిటేజ్ ఇన్స్టిట్యూట్ పర్యవేక్షణలో అది కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశించారు. మహిళల కోసం ఒక ప్రత్యేక బీచ్ తో పాటు పర్యాటక ప్రయోజనాల కోసం ఒక ఆక్వేరియంను సైతం ఈ ప్రాంతంలో నిర్మించాలని షార్జా పాలకుడు డాక్టర్ షేఖ్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ కసిమి తన పర్యటనలో తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







