ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయండి--ఉత్తమ్
- November 24, 2020
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టిఆర్ఎస్పై మండిపడ్డారు. ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం, తర్వాత మర్చిపోవడం టిఆర్ఎస్ పార్టీకి కొత్త కాదని, ఆ పార్టీని, వారి మేనిఫెస్టోను ప్రజలు చెత్తబుట్టలో విసిరేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు కూడా ఓట్ల కోసం అబద్ధపు హామీలు ఇస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గతంలో హుస్సేన్ సాగర్ లో నీళ్లను కొబ్బరినీళ్లలా మార్చుతామన్నారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు.
హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశాన్నంటే భవంతులు కడతామన్నారు, సెలూన్లకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. హైదరాబాదులో ఉచిత వైఫై ఇస్తామన్నారు… వీటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఆరోపించారు. ‘నగరంలో ఒక లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఒక్కటీ ఇవ్వలేదు. నిమ్స్ ఆసుపత్రిని దిగజార్చి బస్తీ దవాఖానాల గురించి గొప్పగా చెబుతున్నారు. కనీసం ఉచితంగా తాగునీరు ఇవ్వలేకపోయారు. టిఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థత వల్లే హైదరాబాద్ వరదల్లో మునిగితే వరద బాధిత కుటుంబాల్లో ఒక్కరినైనా సిఎం కెసిఆర్ పరామర్శించారా?’ అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష