విజయవాడ లో గురునానక్ జయంతి వేడుకలు
- November 29, 2020
విజయవాడ:గురునానక్ జయంతి సందర్బంగా నగరంలోని గురునానక్ కాలనీలోని గురుద్వార్‌లో జరుగుతున్న గురుపూరబ్ ఉత్సవాలలో జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ పాల్గొన్నారు.
ఆదివారం ఈ సందర్భంగా గురుద్వార్‌ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
విశిష్ట రోజుగా భావించే కార్తీక పౌర్ణమి రోజునే గురునానక్ పుట్టిన రోజు కావడం సిక్కులు పర్వదినం.గురునానక్ హిందు, ఇస్లామిక్ దివ్యగ్రంథాలను అధ్యయనం చేశారని కలెక్టర్ ఇంతియాజ్ చెప్పారు.
అదేవిధంగా గురుసింగ్ సహధర్మ ప్రచార్ కమిటీ ప్రతినిధులు ఆహ్వానం మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం గురుద్వార్‌ను సందర్శించి ఉత్సవాలలో పాల్గొననున్నారని సీఎంవో నుంచి అందిన సమాచారంతో సీఎం రాక సందర్భంగా ఏర్పాట్లపై కమిటీ ప్రతినిధులతో చర్చించారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (సంక్షేమం)కె.మోహన్‌కుమార్, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ సభ్యులు ఎస్.హర్ మహీంద్ర సింగ్, వైయస్సార్‌సీపీ తూర్పు నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ దేవినేని అవినాష్, బొప్పన భవకుమార్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్
- కువైట్ ఇతరుల లగేజీపై ప్రయాణికులకు కీలక హెచ్చరిక..!!
- ఓజోన్ పొర పరిరక్షణకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!
- ఖతార్‌లో విస్తరిస్తోన్న స్మార్ట్ సిటీల మార్కెట్..!!
- మక్కా టార్గెట్ గా హౌతీ డ్రోన్.. కూల్చివేసిన సౌదీ..!!
- ఒమన్ సహా గల్ఫ్ దేశాల్లో CBSE ప్రత్యేక పరీక్షలు..!!
- యూఏఈలో ఫ్లూ క్యాంపెయిన్ విస్తరణ..!!
- 974 బీచ్‌లో ‘ఫ్లోటీస్ ఫెస్టివల్’.. సందడి చేసేలా ఏర్పాట్లు..!!
- కువైట్‌లో ప్రవాసులకు లోన్లు మరింత కఠినం..!!
- సౌదీ–ఖతార్‌లో కొత్త చెల్లింపు సదుపాయం..!!







