అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక ..
- February 18, 2016
అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా(ఏఎఫ్ఏ) నూతన కార్యవర్గ సభ్యుల పేర్లను వెల్లడించింది. ఏఎఫ్ఏ బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ సమావేశంలో 2016 వ సంవత్సరానికి కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అక్కినేని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర తెలిపారు.నూతన కార్యవర్గ సభ్యులు వీరే.. అధ్యక్షుడు - రవి కొండబోలు ఉపాధ్యక్షురాలు - శారద అకునూరి కార్యదర్శి - ధామా భక్తవస్తలు కోశాధికారి - రావు కల్వల బోర్డు అఫ్ డైరెక్టర్స్: డాక్టర్. శ్రీనివాస రెడ్డి ఆళ్ళ, డాక్టర్. సి. ఆర్. రావ్, మురళి వెన్నం, చలపతి రావు కొంద్రకుంట, వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్.ప్రసాద్ తోటకూర.అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా నూతన అధ్యక్షుడు రవి కొండబోలు మాట్లాడుతూ - వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో అక్కినేని ప్రథమ వార్షిక పురస్కార ప్రదానోత్సవాన్ని 2014 లో గుడివాడలో, ద్వితీయ పురస్కార ప్రదానోత్సవాన్ని 2015 లో హైదరాబాద్ లోను ఘనంగా జరుపుకున్నామని తెలిపారు. ఈ సంవత్సరానికిగానూ అక్కినేని తృతీయ వార్షిక పురస్కార ప్రదానోత్సవాన్ని డిసెంబర్ లో చెన్నైలో జరుపనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







