యు.ఎ.ఈ. లో భారతీయ యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధి కార్యాలయాలు
- February 18, 2016
యు.ఎ.ఈ. మరియు ఇతర ప్రాంతీయ దేశాలలో భారతీయ యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధి కార్యాలయాలను విస్తరించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు దుబాయ్ లో ఆ బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు గురువారం తెలిపారు. షార్జాలో , బహెరిన్ లో ఈ ప్రతినిధి కార్యాలయాలను ప్రారంభిస్తున్నట్లు యాక్సిస్ బ్యాంక్, సంస్థల రిటైల్ బ్యాంకింగ్ ముఖ్య కార్యనిర్వహాణాధికారి రాజీవ్ ఆనంద్ తెలిపారు. ఈ భారతీయ బ్యాంకుకు గత 9 ఏళ్ళ నుంచి యు.ఎ.ఇ. లో ఒక మంచి ఉనికి ఉందని చెప్పారు. ఇది లైసెన్స్ ను కలిగి ఉండి, ప్రస్తుతం దుబాయ్ అంతర్జాతీయ ఆర్ధిక కేంద్రం విభాగం ఒకటి లో తన ఆర్ధిక కార్యకలాపాలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అబుదాబీ లోనూ యాక్సిస్ బ్యాంక్ ఒక ప్రతినిధి కార్యాలయంను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. యాక్సిస్ బ్యాంక్ ఇప్పటికే సింగపూర్ , హంగ్ కాంగ్ , కోలోంబో, షాంఘై దేశాలలో బ్యాంకు అనుబంధ కార్యాలయాలు ఉన్నాయని, ప్రతినిధి కార్యాలయాలు దుబాయి , అబుధాబి , ఢాకా మరియు యాక్సిస్ బ్యాంక్ యునైటెడ్ కింగ్డమ్ లిమిటెడ్ లలో మరిన్ని ప్రతినిధి కార్యాలయాల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకొని నియంత్రణ అనుమతికై ఎదురుచూస్తుంది. యాక్సిస్ బ్యాంక్ 6 బిలియన్ డాలర్ల బాలన్స్ షీట్ ను కలిగి ఉంది. యు.ఎ.ఈ. లో ఉన్న ప్రవాస భారతీయులు చేసే చెల్లింపుల మీద, కార్పరేటే రుణ మరియు ఆర్ధిక వాణిజ్యంపై తన దృష్టిని సారించింది. గల్ఫ్ దేశాల సమాఖ్య లో గత ఏడాది దాదాపు 2.6 బిలియన్ డాలర్లను వ్యాపార నిమిత్తం ఇచ్చినట్లు తెలుస్తుంది. యాక్సిస్ బ్యాంక్ వ్యాపారంలో గల్ఫ్ దేశాల సమాఖ్య మరియు ఆఫ్రికాలో గణనీయమైన అభివృద్ధిలో ఉంది. దుబాయి , అబుధాబిలలో స్వంత కార్యాలయాలు నెలకొల్పేమని మరి ఇతర చోట్ల కొన్ని బ్యాంకుల సహకారంతో వ్యాపారాభివృద్ధి చేయనున్నట్లు యాక్సిస్ బ్యాంక్, సంస్థల రిటైల్ బ్యాంకింగ్ ముఖ్య కార్యనిర్వహాణాధికారి రాజీవ్ ఆనంద్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







