ఈ నెలాఖరి నాటికి ఒమన్ కు చేరుకోనున్న కోవిడ్ వ్యాక్సిన్
- December 07, 2020
మస్కట్:కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ఈ నెలాఖరు నాటికి సుల్తానేట్ చేరుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో వ్యాక్సిన్లు, ఒమన్ లో వాటి ప్రభావం, ప్రస్తుత పరిస్థితులు తదితర అంశాలపై ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ-ఈఎమ్ఏ, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినేస్ట్రేషన్-ఎఫ్డీఏ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి వ్యాక్సిన్ కు అనుమతులు అవసరమైన నేపథ్యంలో ఫైజర్ వ్యాక్సిన్ కు తుది అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. అయితే...ప్రపంచంలోనే ఫైజర్ కు అనుమతి ఇచ్చిన తొలి దేశం బ్రిటన్..ఈ వారంలోనే వ్యాక్సిన్ పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 40 మిలియన్ల డోసులు ఆర్డర్ ఇవ్వగా..తొలిదశలో 10 మిలియన్ల డోసులు త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి. ఫైజర్ యూఎస్ బేస్డ్ వ్యాక్సిన్ కావటంతో...వ్యాక్సిన్ ను ఒమన్ కు సరఫరా చేయాలంటే అమెరికాకు చెందిన ఎఫ్డీఏ అనుమతి అవసరం. అయితే..బ్రిటన్ కు చెందిన ఈఎమ్ఏ ఫైజర్ కు అనుమతి రావటంతో...ఇక అమెరికా ఎఫ్డీఏ నుంచి కూడా వచ్చే వారంలో తుది అనుమతి లభించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ నెల చివరి వారంలో ఒమన్ కు వ్యాక్సిన్ సరఫరా కావొచ్చని ఒమన్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. వ్యాక్సిన్ దిగుమతి, వాటి భద్రపరిచే ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా ఎం.సాయి కుమార్ బాధ్యతలు స్వీకారం
- టీవీ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చిన యూట్యూబ్
- కువైట్ లో విషాదం..రోడ్డు పై 5 మంది మృతి!!
- ప్రయాణికులకు ఊరట.. గల్ఫ్ ఎయిర్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- కువైట్ కాన్సులేట్ పై జరిగిన దాడిని ఖండించిన ఒమన్..!!
- పౌల్ట్రీ ఉత్పత్తుల ఆందోళనపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- ఖతార్ రియల్ దూకుడు.. సైలెంట్ మంత్ లోను వృద్ధి నమోదు..!!
- కాల్పుల విరమణ.. యూఏఈ ట్రావెల్ ఏజెన్సీలకు భారీగా పెరిగిన విచారణలు..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం









