ఏలూరు వింత వ్యాధికి కారణం ఇదే..ఎయిమ్స్ నిర్ధారణ

- December 08, 2020 , by Maagulf
ఏలూరు వింత వ్యాధికి కారణం ఇదే..ఎయిమ్స్ నిర్ధారణ

ఏలూరు:ఏలూరులో కలకలం రేపుతోన్న వింత వ్యాధికి సంబంధించి ఢిల్లీ ఎయిమ్స్ సంచలన విషయాలను బయటపెట్టింది. భార లోహాలకారణంగానే ప్రజలు అస్వస్థతకు గురవుతున్నట్టు నిర్ధారించింది. పేషంట్ల రక్తనమూనాలను పరీక్షించిన వైద్యులు రక్తంలో లెడ్ హెవీ మెటల్, నికెల్ మెటల్స్ ఉన్నట్టు గుర్తించారు. రక్తంలో లెడ్ మెటల్ పరిమాణం పెరిగితే న్యూరో టాక్సిక్ లక్షణాలు వస్తాయని చెబుతున్నారు. ఇది త్రాగు నీటి ద్వారా లేదంటే పాల ద్వారా వ్యాప్తి చెందుతుందని చెప్పారు. టెస్ట్ శాంపిళ్లను మంగళగిరి ద్వారా ఎయిమ్స్ రాష్ట్రానికి అందించింది. ఏ వర్గం వారి రక్తంలో పరిమాణాలు పెరిగాయో గుర్తించాలని చెప్పింది.

మెటల్స్ ను గుర్తించే అధునాతన పరికరాలు ఢిల్లీ ఎయిమ్స్ లో ఉన్నాయని పేర్కొంది. ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించాలని బీజేపీ ఎంపీ జి.వి.యల్ నర్సింహారావు అన్నారు. నీటి, పాల శాంపిల్స్ ను కూడా వెంటనే పంపించాలని కోరారు.హెవీ మెటల్స్ శరీరంలోకి ఎలా ప్రవేశించాయన్నది స్థానిక అధికారులు నిర్ధారించాలని అన్నారు. మరోవైపు కేంద్ర బృందం నేడు ఏలూరులో పర్యటించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com