పెదనాన్న కోసం ఓ సినిమా

- February 19, 2016 , by Maagulf
పెదనాన్న కోసం ఓ సినిమా

'బాహుబలి 2' పూర్తయ్యేంత వరకూ మరో విషయం గురించి ఆలోచించడం లేదు ప్రభాస్‌. ఈలోగా ప్రభాస్‌ కోసం కొత్త కథలు సిద్ధమవుతూనే ఉన్నాయి. అయితే దేనికీ పచ్చజెండా వూపలేదు. 'అన్నీ బాహుబలి తరవాతే' అన్నది ప్రభాస్‌ ఆలోచన. అయితే పెదనాన్న కృష్ణంరాజు కోసం మాత్రం తన ఆలోచనలకు సవరణ ఇస్తున్నాడట. కృష్ణంరాజు తన గోపీ కృష్ణ సంస్థలో ప్రభాస్‌తో ఓ సినిమా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకొన్నారు. 'ఒక్క అడుగు' అనే స్క్రిప్టు కూడా సిద్ధంగానే ఉంది. 'బాహుబలి' కోసం ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు ఎలాగైనా సరే, ఈ సినిమాని పట్టాలెక్కించాలని కృష్ణంరాజు భావిస్తున్నారట.అందుకు ప్రభాస్‌ కూడా సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తోంది. 'బాహుబలి 2' షూటింగ్‌ జులైలో పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఆ వెంటనే పెదనాన్న సినిమానే పూర్తి చేయాలన్నది ప్రభాస్‌ ఆలోచన. 'ఒక్క అడుగు'ని పక్కన పెట్టాల్సి వస్తే సుజిత్‌ సిద్ధం చేసుకొన్న కథని గోపీకృష్ణ సంస్థ ద్వారా సెట్స్‌పైకి తీసుకెళ్లాలని నిర్ణయించుకొన్నాడట. మొత్తానికి పెదనాన్న కోసం ఓ సినిమా చేయడం ఖాయమని... అది ఈ యేడాదే సెట్స్‌పైకి వెళ్తుందని చెప్పుకొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com