జీమెయిల్లో కొత్త ఫీచర్ను జత
- February 19, 2016
అత్యుత్తమ మెయిల్ సర్వీసుల్లో అగ్రగామిగా ఉన్న జీమెయిల్లో కొత్త ఫీచర్ను జత చేర్చారు. ఇకపై యాహూ.. అవుట్లుక్.. హాట్మెయిల్ను కూడా జీమెయిల్లో ఓపెన్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ వెల్లడించింది.సందేహాలు: 'ఫ్రీడమ్ 251' ఒక స్మార్ట్ఫోన్ కుంభకోణమా?ఈ ఫీచర్కు పెట్టిన పేరు జీమెయిల్ఫై. 'జీమెయిల్ఫై' ఫీచర్ కోసం ముందుగా జీమెయిల్లోకి ఈమెయిల్ ఐడీలు, పాస్వర్డ్లతో లాగిన్ అవ్వాలి.ఆ తర్వాత 'జీమెయిల్ఫై' ఫీచర్ను ఎనేబుల్ చేయాలి. తద్వారా మీ జీమెయిల్లో యాహూ, అవుట్ లుక్, హాట్మెయిల్ పని చేయడం మొదలవుతుంది.యాహూ, అవుట్లుక్, హాట్మెయిల్ మెయిళ్లకూ స్పామ్ ప్రొటెక్షన్ పని చేస్తుంది. దీంతో పాటు జీమెయిల్ లాగే ఇన్బాక్స్ టూల్స్ పనిచేస్తాయని జీమెయిల్ తన అధికారిక బ్లాగులో వెల్లడించింది. అంతేకాదు ఈ ఫీచర్ను వద్దనుకుంటే కొన్ని మెయిల్ ఐడీలను జీమెయిల్ఫై నుంచి తొలగించే వీలును కూడా కల్పించింది.
ప్రస్తుతం యాహూ, హాట్మెయిల్, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ ఈమెయిళ్లకు మాత్రమే జీమెయిల్ఫై పనిచేస్తుందని.. త్వరలో మరిన్ని అందుబాటులోకి రానున్నట్లు గూగుల్ తెలిపింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







