ఫేక్ ఫేక్ ఫేక్ డిగ్రీస్
- May 28, 2015
క్షణాల్లో ఎంబీఏ సర్టిఫికెట్ దొరికేస్తోంది. రేట్ ఒక్కటే తేడా. ఆ రేట్ కూడా ఓకే అయితే వ్యక్తిగత వివరాలు ఏవీ లేకపోయినా డిగ్రీ చేతిలో వచ్చి వాలిపోతుంది. ఈ డిగ్రీల్ని ‘సరఫరా’ చేయడానికి కొన్ని ఫేక్ యూనివర్సిటీస్ తయారయ్యాయి. రోచ్విల్లే, బెల్ఫోర్డ్, మిడ్ టౌన్, ఎడ్జ్బ్రూక్, బెల్టౌన్, యాష్లే, పోర్ట్ జెఫర్సన్, పారామౌంట్ కాలిఫోర్నియా వంటి ఫేక్ యూనివర్సిటీస్ నుంచి డిగ్రీలు పొంది, వివిధ కంపెనీల్లో కీలక ఉద్యోగాల్ని సంపాదించుకున్నట్లు ఎక్స్ప్రెస్ అనే సంస్థ జరిపిన ఇన్వెస్టిగేషన్లో తేలింది. యూఏఈలోని ఎగ్జాక్ట్ సంస్థలో 350 మంది ఫేక్ డిగ్రీలతో ఉద్యోగాలు సంపాదించినట్లు గుర్తించడంతో ఈ ఫేక్ కుట్ర గుట్టు బయటపడిరది. బ్యాంకింగ్, హాస్పిటాలిటీ, హాస్పిటల్, రిటెయిల్ ఇలా అన్ని రంగాల్లోనూ ఈ ఫేక్ డిగ్రీ హోల్డర్స్ ఉద్యోగాలు పొందినట్లు తేలింది. డాక్టర్ ఆర్.శ్రీనివాసరావు, ఇంటర్నెట్లో ప్రకటన చూసి పిహెచ్డి కోసం అప్లయ్ చేశారు. 2011 నుంచి 2014 వరకూ కోర్స్ కూడా పూర్తి చేశారు. అయితే ఆ యూనివర్సిటీ ఫేక్ అని ఆ తర్వాతే ఆయనకు తెలిసింది. ఇతను మోసపోయిన బాధితుడు. ఓ రిటైల్ ఫర్మ్ వైస్ ప్రెసిడెంట్ని ఫేక్ డిగ్రీ గురించి ఫోన్లో ప్రశ్నిస్తే, ‘నా డిగ్రీ ఫేక్ అనడానికి మీకెంత ధైర్యం?’ అని ప్రశ్నిస్తూ లైన్ కట్ చేశాడు. ఈ ఫేక్ డిగ్రీస్ కుంభకోణంలో భారీ మొత్తం చేతులు మారినట్లుగా అంచనా వేస్తున్నారు. పైన పేర్కొన్న యూనివర్సిటీలనుంచి డిగ్రీలు పొందిన ఉద్యోగులు ఎవరైనా ఉంటే ఆయా సంస్థలు ఇప్పటికైనా మేల్కొనాల్సి ఉంది.
-- సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







