బాంబు దాడిలో హతమొందిన 40 మంది తీవ్రవాదులు...
- February 19, 2016
లిబియాలో వైమానిక దాడులు తీవ్ర రూపం దాల్చాయి. శుక్రవారం గుర్తుతెలియని ఓ యుద్ధ విమానం గగనతలం నుంచి జరిపిన బాంబు దాడుల్లో సుమారు 40 మంది ఇస్లామిక్ మిలిటెంట్లు హతమై ఉంటారని లిబియా అధికారులు భావిస్తున్నారు. లిబియా రాజధాని ట్రిపోలి సమీపంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు సబ్రతా అనే ప్రాంతంలో ఓ ఇంట్లో సమావేశమయ్యారు.ట్యూనీషియా సరిహద్దులో ఉన్న ఐఎస్ఐఎస్ సభ్యలను లక్ష్యంగా చేసుకుని యుద్ధ విమానం బాంబులతో దాడిచేయగా 40 మందికి పైగా తిరుగుబాటుదారులు మృతిచెందారు. ఈ దాడుల్లో ఉగ్రవాదులు సమావేశమైన ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ట్రిపోలికి సరిహద్దుగా ఉన్న ట్యూనీషియా సమీపంలో ఈ దాడులు జరిగాయని హుస్సేన్ అల్ దవాదీ అనే అధికారి వెల్లడించారు.ట్యూనీషియాలో గతేడాది జరిగిన ఉగ్రదాడులకు ప్రతీకారంగా తామే ఈ దాడులు చేశామని అమెరికా మీడియాకు అక్కడి అధికారులు వెల్లడించినట్లు సమాచారం.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







