మేడారం సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లించేందుకు 15 లక్షల మంది...
- February 19, 2016
మేడారం సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లించేందుకు శుక్రవారం భక్తులు భారీ సంఖ్యలో గద్దెల వద్దకు తరలివచ్చారు. సాయంత్రం 7గంటల వరకు సుమారు 15 లక్షల మంది అమ్మవార్ల దర్శనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికీ భక్తులు అధికసంఖ్యలో కూలైన్లలో వేచియున్నారు. ఒకేసారి వేలసంఖ్యలో అమ్మవార్లను దర్శనం చేసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. పెద్దఎత్తున క్యూలైన్లలో భక్తులు ఉన్నప్పటికీ 3 నుంచి 4 గంటల్లో దర్శనం అవుతోంది. శుక్రవారం ఒక్కరోజే 50లక్షల మంది వరకు అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.పోలీసు, జిల్లా అధికార యంత్రాంగం మొత్తం మేడారంలోనే ఉండి భక్తుల సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు. భారీగా భక్తులు తరలివస్తున్నందున వీఐపీలు ఎవరూ రావొద్దని అధికారులు విన్నవించారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







