నేటి నుంచి మూడ్రోజుల పాటు కుంభమేళా..
- February 19, 2016
దక్షిణ కాశీగా భావించే తిరుమ కూడలు నరసీపురలో శనివారం నుంచి మూడ్రోజుల పాటు కుంభమేళాను నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నదిలో నీరు తక్కువగా ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తగా అన్ని భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశంలోని వివధ ప్రాంతాల నుంచి 250మందికి పైగా సాధువులు రానున్నట్లు అంచనా. మూడ్రోజుల పాటు సాగనున్న కుంభమేళాలో 15లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలకు వస్తారని నిర్వాహకులు తెలిపారు. తిరుమకూడలు నరసీపురలో కావేరి, కపిల, స్పటిక నదులు కలుస్తాయి.దక్షిణాది భక్తులు హరిద్వారకు వెళ్లడం కష్టంగా ఉన్నందున 1989 నుంచి ప్రతీ మూడేళ్లకోసారి కుంభమేళాను నిర్వహిస్తున్నారు. ఈసారి నిర్వహిస్తున్న మేళా పదవది. కుంభమేళా సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సు సదుపాయాన్ని కల్పించారు. వాహన సంచారానికి సమస్య ఎదురవకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అభినవ ఖరె తెలిపారు.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







