హైదరాబాద్:కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
- December 12, 2020
హైదరాబాద్:హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లా బొల్లారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది... బొల్లారంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. స్థానికంగా ఉన్న వింధ్యా ఆర్గానిక్ కంపెనీ పెద్ద శబ్దంతో రియాక్టర్ పేలుళ్లు సంభవించినట్టు చెబుతున్నారు.. ఆ తర్వాత మంటలు చెలరేగి కంపెనీ మొత్తం వ్యాపించాయి.. భారీ పేలుడుతో కంపెనీలోని కార్మికులు కకావికలమయ్యారు.. భారీ పేలుళ్లతో షాక్ అయిన కార్మికులు కంపెనీ నుంచి పరుగులు పెట్టారు.. కొందరు గాయాలతో కిందపడి అల్లాడుతున్నట్టుగా చెబుతున్నారు.. గాయాలపాలైన కొందరు కార్మికులను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా... కంపెనీలోనే మరికొందరు చిక్కుకున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. ఇక, పేలుళ్లు, మంటలతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.. దాదాపు కిలోమీటర పరిధిలో పొగ కమ్ముకుపోయింది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







