తెలంగాణ:PCC అధ్యక్ష పదవిపై కొనసాగనున్న సంప్రదింపులు
- December 14, 2020
హైదరాబాద్:తెలంగాణ PCC అధ్యక్ష పదవిపై సంప్రదింపులు కొనసాగనున్నాయి. పీసీసీ చీఫ్ అంశానికి సంబంధించి ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ హైకమాండ్‌కి ఇంకా నివేదిక ఇవ్వలేదు. 18 కేటగిరిలలో 162 మంది నేతల అభిప్రాయాలు తీసుకున్నామని.. పీసీసీ అధ్యక్ష పదవిపై సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. జిల్లా స్థాయి నేతల వరకూ అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నామని.. క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు తీసుకున్నాకే నూతన అధ్యక్షుడి నియామకం ఉంటుందని తెలిపారు. అటు.. ప్రజల్లో బలం లేని నేతలే కాంగ్రెస్‌ను వీడుతున్నారని.. కొందరు పార్టీని వీడినా నష్టం లేదని మాణిక్కం ఠాగూర్ స్పష్టం చేశారు. సంస్థాగత లోపాల వల్లే గ్రేటర్లో సరైన ఫలితాలు రాలేదన్న ఠాగూర్.. ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ అన్నట్టు బీజేపీ-టీఆర్ఎస్ స్నేహం ఉందని ఆరోపించారు.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







