కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి-గల్ఫ్ JAC
- December 14, 2020
హైదరాబాద్:తెలంగాణ గల్ఫ్ కార్మికుల వెల్ఫేర్ బోర్డు (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చేయాలని కోరుతూ గల్ఫ్ జెఏసి ప్రతినిధి బృందం సోమవారం హైదరాబాద్ లో టిఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు కె.ఆర్ సురేష్ రెడ్డి, ఖమ్మం లోక్ సభ సభ్యులు, లోక్ సభలో టిఆర్ఎస్ సభాపక్ష నాయకుడు నామా నాగేశ్వర్ రావు మరియు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిలను కలిసి వినతి పత్రాలు సమర్పించారు.
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్‌తో కూడిన ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలన్నారు.గల్ఫ్‌లో చనిపోయిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, విదేశాలల్లో వివిధ కారణాలతో ఉండిపోయిన వారిని స్వదేశానికి రప్పించి ఉపాధి, వైద్య, విద్య సదుపాయాలు కల్పించాలన్నారు.
తెలంగాణ రాష్ట్రా నికి చెందిన సుమారు 15లక్షల మంది గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లారని చెప్పారు.కేరళ రాష్ట్రంలో ఏర్పాటు చేసి న మాదిరిగా నాన్ రెసిడెన్షియస్ తెలంగాణ నైట్ వెల్ఫేర్ ఆక్టి వ్ ద్వారా గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేయాలని, ప్రతీ ఏడాది రూ.500కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. గల్ఫ్ బాధితులకు సబ్సిడీతో రుణాలు ఇచ్చి ఉపాధి కల్పించాలని కోరారు.నాయకులంతా సానుకులంగా స్పందిస్తూ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి బోర్డు ఒచ్చేలా కృషి చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో గల్ఫ్ వలస కార్మిక నాయకులు మంద భీంరెడ్డి,కోటపాటి నర్సింహం నాయుడు,ఏముల రమేష్,నంగి దేవేందర్ రెడ్డి, పట్కురి బసంత్ రెడ్డి,గంగుల మురళీధర్ రెడ్డి, పడాల నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







