రేపు దుబాయ్ లో జరగనున్న వాహన రహిత దినోత్సవం
- February 20, 2016
దుబాయ్ లో ఫిబ్రవరి 21వ తేదీన ( రేపు ) జరగనున్న వాహన రహిత దినోత్సవంలో స్థానికులు వెయ్యి కంపెనీలు, వివిధ సంస్థల కార్మికులు పాల్గొననున్నారు, వీరంతా తమకు చెందిన వాహనాలను ఇళ్ళ వద్దనే నిలిపి ప్రత్యమ్నాయ పద్ధతులలో పర్యావరణానికి హాని కాకుండా ఈ రోజును గడుపుతారు. ఈ చర్య ప్రపంచానికి ఎమిరేట్ పర్యావరణానికి అనుకూలమైన ప్రధమ స్థాన దేశంగా మార్చేందుకు కృషి చేస్తున్నారు. 7వ దఫా జరిగే ఈ వాహన రహిత దినోత్సవంకు ఒక ప్రేత్యేకత ఉంది. గత ఏడాది ఈ కార్యక్రమంలో 300 సంస్థలు, 30 వేలమంది ప్రజలు తమ తమ కార్లకు పూర్తి విశ్రాంతిని ఇచ్చి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏడాది అంతకన్నా రెట్టింపు సంఖ్యలో ప్రజలు పాల్గొనవచ్చని, అంచనా వేస్తున్నారు. వాహన రహిత దినోత్సవం ద్వారా ఒక్కరోజులో 140 టన్నుల కార్బన్ డయాక్సైడ్ , 147,000 లీటర్ల ఇంధనం పొదుపు అవుతుంది. ఈ ప్రభావం ఎంతోకొంత పర్యావరణానికి మేలు చేసినట్లువుతుందని ఈ కార్యక్రమ నిర్వాహకులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







