బాలకృష్ణ 100 వ సినిమా లైన్ లో కృష్ణ వంశీ!
- February 20, 2016
బాలకృష్ణ 100 వ సినిమా చిరంజీవి 150 వ సినిమా ఇప్పట్లో తేలేలా కనపడ్డం లేదు. బోయపాటి తో అనే న్యూస్ నుంచి సింగీతం , పరుచూరి ఇలా రోజుకొక పేరు తో సాగుతోంది కథ. మరొక పక్క డైరెక్టర్ క్రిష్ ఒక లైన్ చెప్పాడు అని వార్తలు కూడా వినపడ్డాయి. వీరందరిలో ఎవరికి సంతకం పెట్టాలో తెలియని బాలకృష్ణ కి మధ్యలో కృష్ణ వంశీ ఒచ్చి ఒక కొత్త లైన్ చెప్పాడు అని అంటున్నారు. అది కూడా సోషియో ఫ్యాంటసీ సినిమా అట . బాలకృష్ణ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే స్క్రిప్ట్ ఇదే అని తన మీద నమ్మకం ఉంచి ఒప్పుకోమని కృష్ణ వంశీ రిక్వస్ట్ ల మీద రిక్వస్ట్ లు చేస్తున్నాడట. ఇదివరకు శ్రీ ఆంజినేయం లాంటి సినిమాలని డీల్ చేసాడు డైరెక్టర్ కృష్ణ వంశీ. ఇప్పుడు రుద్రాక్ష అనే స్క్రిప్ట్ మీద పని చేస్తున్నాడు.బాలకృష్ణ తో సినిమా ఓకే అయితే దాన్ని పక్కన పెట్టేస్తాను అని కూడా మాట ఇచ్చాడట. పర్సనల్ గా బాలక్రిష్ణని కలిసిన కృష్ణ వంశీ తన స్క్రిప్ట్ మొత్తం బలయ్యకి ఇచ్చి తీరికగా ఉన్నప్పుడు చదవమని వెళ్ళిపోయాడట. బాలయ్య కి కూడా లైన్ నచ్చింది అనీ ఈ స్క్రిప్ట్ తో సినిమా చేయచ్చు గానీ అది కచ్చితంగా 100 వ చిత్రంగా చెయ్యలా దాని తరవాత చెయ్యలా అనే దాని మీద బాలకృష్ణ మల్లగుల్లాలు పడుతున్నాడట.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







